27 July, 2026 | 5:26 PM

ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

27-07-2026 04:39 PM

భూపాలపల్లి, జులై 27(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను(Praja Vani petitions) సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి స్వయంగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో మొత్తం 71 దరఖాస్తులు అందాయని, వాటిని సంబంధిత శాఖల అధికారులకు తగు చర్యల కోసం పంపినట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా బాధితులకు న్యాయం జరిగేలా అర్జీలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిఆర్ఓ వసంత కుమారి, భూపాలపల్లి ఆర్డీవో హరికృష్ణ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.