4 August, 2026 | 1:57 AM

మాజీ ఎమ్మెల్యేతో ‘కంజర్ల’ భేటీ!

04-08-2026 12:00 AM

తాండూరు, ఆగస్టు 3 (విజయక్రాంతి): తాండూర్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావుతో ‘కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్‘ చైర్ పర్సన్ విజయలక్ష్మి బషీరాబాద్‌లోని ఆయ న నివాసంలో సోమవారం భేటీ అయ్యారు. గంటపాటు కొనసాగిన సమావేశంలో స్థానిక రాజకీయ విషయాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఆమె ఇటీవల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరం నుండి వచ్చి పల్లెల్లో సేవ చేయడం అభినందనీయమని.. నిరుపేదలకు, మహిళలకు మరింత సేవ చేయాలని భవిష్యత్తులో తాను అండగా నిలుస్తానని విజయలక్ష్మికి మాజీ ఎమ్మెల్యే భరోసా ఇచ్చినట్లు సమాచారం.