సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
సంగారెడ్డి/మెదక్/యాదాద్రి భువనగిరి/వికారాబాద్/ఎల్బీనగర్, జూన్ 10 (విజయ క్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోందని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారి సమస్యలు తెలుకొని పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపించారు. అధికారులు దరఖాస్తులను పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.
l జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వ హించిన ప్రజావాణిలో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీక రించారు. మొత్తంగా 91 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
l యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్ హనుమంత్ కే జండగే ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 40 దరఖాస్తులు అందినట్టుగా అధికారులు తెలిపారు. ప్రజావాణిలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎంఏ కృష్ణన్, జెడ్పీ సీఈవో శోభారాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, డీఏవో జగన్మోహన్ ప్రసాద్ పాల్గొన్నారు.
l వికారాబాద్‌లో ప్రజావాణిలో భాగంగా అధికారులు 96 ఫిర్యాదులను స్వీకరించారు.
l ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో కమిషనర్ పంకజ ప్రజల నుంచి దరఖాస్తుల ను స్వీకరించారు. మొత్తం ఆరు దరఖాస్తు లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
l రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ప్రజావాణిలో 79 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ శశాంక, అధికారులు పాల్గొన్నారు.
l సిద్దిపేట రూరల్: సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించగా 14 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్‌వో నాగరాజమ్మ, డీఆర్‌డీఏ పీడీ జయదేవ్ ఆర్యా పాల్గొన్నారు.






