4 May, 2026 | 7:49 PM

ఆర్మూర్‌లో ప్రజావాణి ప్రారంభం

04-05-2026 06:45 PM

ర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ సబ్-కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్మూర్ సబ్-కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విభాగ స్థాయి అధికారులు అందరూ హాజరై పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలకు సంబంధించిన మొత్తం నాలుగు వినతిపత్రాలు స్వీకరించారు. అందిన వినతులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించబడతాయని సబ్-కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ హామీ ఇచ్చారు.