15 June, 2026 | 6:53 PM

ప్రజావాణికి 93 దరఖాస్తులు

15-06-2026 06:01 PM

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వరంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన ప్రజలు 93 దరఖాస్తులను అందజేశారు. ప్రజావాణిలో భూ సమస్యలు, సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఉపాధి, గృహాలు, రెవెన్యూ , ఇతర శాఖలకు సంబంధించిన వినతులు ప్రజలు సమర్పించారు. అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.