15 June, 2026 | 6:51 PM

సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు

15-06-2026 05:57 PM

హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జి నక్కా శ్యాంసుందర్, జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్

హుజూర్ నగర్: సత్వర న్యాయం అందించడానికి లోక్ అదాలత్ లను నిర్వహిస్తున్నట్లు హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జి నక్కా శ్యాంసుందర్,అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్ లు  తెలిపారు. సోమవారం పట్టణంలోని న్యాయస్థాన సముదాయంలో న్యాయవాదులతో, పోలీస్ అధికారులతో వేరువేరుగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పూర్వం రచ్చబండల వద్ద గ్రామ పెద్దలు చేసిన పంచాయతీ తీర్మానాల రూపంలో చట్టబద్ధత కలిగిన మధ్యవర్తిత్వ చట్టం రూపొందించబడినది

అని ఆ చట్టం ప్రకారం మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారులు తమ వివాదమును పరిష్కరించుకున్నట్లయితే దానికి చట్టబద్ధత లభిస్తుందన్నారు.నేడు జనాభా పెరుగుదల కారణంగా వ్యక్తుల మధ్య క్షణావేశంగా కక్షలు ఏర్పడి వివాదాలు పెరిగి కేసులు నమోదు అవుతున్నాయని,ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకునే విధంగా వారిని చైతన్య పరచాలని న్యాయవాదులను వారు కోరారు. కక్షిదారులు న్యాయస్థానాలకు వచ్చే అవసరం లేకుండా గ్రామస్థాయిలోనే వారి వివాదాల పరిష్కారానికి గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేసే ప్రక్రియ న్యాయ వ్యవస్థ పరిశీలనలో ఉన్నదని వారు వివరించారు.అత్యధికంగా కేసులు రాజీ అయ్యే విధంగా న్యాయవాదులు, పోలీస్ అధికారులు విశేషంగా కృషి చేయాలని న్యాయమూర్తులు కోరారు.