బల్దియాలో రేపటి నుంచి ప్రజావాణి
09-06-2024 10:03 PM
హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి కాట తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా 040 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. తర్వాత ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుందన్నారు. నగరంలోని జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి జరుగుతుందని కమిషనర్ తెలిపారు. అదే విధంగా ఎన్నికల ప్రక్రియ ముగిసినందున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేపటి నుంచి ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ ఓ ప్రకటనలో తెలిపారు.






