బీజేపీదే గెలుపు
303 సీట్లు సాధించటం పక్కా
మరోసారి తేల్చి చెప్పిన ప్రశాంత్‌కిషోర్
న్యూఢిల్లీ, జూన్ 1: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పునరుద్ఘాటించారు. 2019లో సాధించిన సీట్లకు అటు ఇటుగా ఈసారి కూడా వస్తాయని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 లోక్‌సభ సీట్లు గెలుచుకొన్నది. శనివారం లోక్‌సభ ఎన్నికల చివరిదశ పోలింగ్ ముగియటానికి కొన్ని గంటల ముందు ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘నా అంచనా ప్రకారం బీజేపీ మళ్లీ దాదాపు అన్నే సీట్లు గెలచుకొని అధికారంలోకి రాబోతున్నది. ఇసారి ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బలంలో పెద్దగా మార్పు లేకపోవచ్చు. తూర్పు, దక్షిణాది రాష్ట్రాలో బీజేపీ అద్భుతమైన మద్దతు లభించబోతున్నది. ఈ రాష్ట్రాల్లో ఓట్ల శాతం కూడా బీజేపీ భారీగా పెరుగనున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు లో బీజేపీ అద్భుతంగా పుంజుకోనున్నది’ అని వెల్లడించారు.






