calender_icon.png 15 June, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసియా కప్ పోటీలకు ప్రవళిక ఎంపిక

14-06-2025 12:00:00 AM

అభినందించిన పద్మారావు గౌడ్

వారసిగూడ, జూన్ 13 (విజయక్రాంతి) : సీతాఫలమండీకి చెందిన సాఫ్ట్ బాల్ క్రీడాకారిణి చేపుర్వ ప్రవలిక ఆసియా కప్ పోటీలకు ఎంపికైం ది. చైనాలో నిర్వహించే ఈ పోటీలకు తెలంగాణా రాష్టం నుంచి భారత దేశం పక్షాన ఈ పోటీలకు ఆమె ఎంపికైంది. సీతఫలమండీ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రవలికను సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ఘనంగా సత్కరించారు.

గతంలో తెలంగాణ రాష్ట్రం పక్షాన 25 కు పైగా జాతీయ, అంతర్జాతీయ వేదికల పై సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొన్న ప్రవలిక వరుసగా మూడో సారి అంతర్జాతీయ స్థాయి లో ఎంపికై నట్లు పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొంటూ, భవిషత్తులో మరింతగా రాణించి తెలంగాణా రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.