6 July, 2026 | 10:08 PM

ముత్తారం ఎంపీడీవోగా ప్రవీణ్ కుమార్ నియామకం

06-07-2026 09:28 PM

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండల నూతన ఎంపీడీవోగా ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ధర్మారం మండలంలో ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తుండగా, సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఆయనను ముత్తారం మండలానికి బదిలీ చేశారు. ముత్తారం మండలంలో ఎంపీడీవోగా పనిచేసిన గంగల లలిత ఈ నెల 1న పదవీ విరమణ పొందారు. అనంతరం ఇన్‌చార్జి ఎంపీడీవోగా బాధ్యతలు నిర్వహించిన సురేష్, సూపరింటెండెంట్‌గా కమాన్‌పూర్‌కు బదిలీ అయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.