6 July, 2026 | 10:09 PM

శివంపేట గ్రామానికి నిధుల మంజూరుపై హర్షం!

06-07-2026 09:34 PM

సర్పంచ్ రాజిపేట వెంకటేశ్వర్!!

శివంపేట,(విజయక్రాంతి): మండల కేంద్రమైన శివంపేట ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి మూడు లక్షలు నిధులు మంజూరు చేసినందుకు నర్సాపూర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు గ్రామ సర్పంచ్ రాజి పేట వెంకటేశ్వర్ మరియు పాలకవర్గం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాజీ జెడ్పిటిసి పబ్బా మహేష్ గుప్తా, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజా రమణా గౌడ్ సహకారంతో నిధులు మంజూరైనాయని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ గ్రామంలో ఎస్సీ కాలనీలో కొంతమేర సిసి రోడ్ల  ఇబ్బందులు తీరనున్నట్లు అన్నారు.