13 May, 2026 | 3:47 PM

మఠంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరణ

13-05-2026 02:41 PM

మఠంపల్లి మే 13(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా బి.ప్రవీణ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మునగాల మండలంలో పనిచేస్తూ మఠంపల్లి కి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎస్సై గా పనిచేస్తున్న పి.బాబు నల్గొండ వీఆర్ కు బదిలీ అయ్యారు.బదిలీపై వెళ్తున్న ఎస్సై బాబును పోలీస్ సిబ్బంది ఘనంగా సత్కరించారు.నూతన ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు పరిరక్షించడానికి కృషి చేస్తానని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మండలంలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్న నేరుగా పోలీసు స్టేషన్ లో సంప్రదించాలన్నారు.