6 May, 2026 | 9:29 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

సుసంపన్న భారత్ వాజ్‌పేయి విజన్

26-12-2024 03:43 AM
  • వాజ్‌పేయి సేవల్ని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ
  • ఆయన రచనలు ప్రజల్లో స్ఫూర్తి నింపాయి
  • అటల్ జీ హయాంలోనే ఐటీ, టెలికాం విప్లవానికి నాందిపడిందని ‘ఎక్స్’లో ప్రధాని పోస్ట్
  • శత జయంతి సందర్భంగా స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: సుసంపన్న, బలమైన భారతదేశ నిర్మాణం కోసం వాజ్‌పేయి తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా కొనియాడారు. దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు వాజ్‌పేయి విజన్, మిషన్‌లు తమకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు. దేశంలో రాజకీ య అస్థిరత ఉన్న సమయంలో భారత ప్రధానిగా బాధ్యత లు స్వీకరించి ప్రజలకు సుస్థిర పాలన అందించినట్టు పేర్కొన్నారు.

వాజ్‌పేయి తన హయాంలో స్వర్ణ చతుర్భు జి ప్రాజెక్ట్, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, ఢిల్లీ మెట్రో కోసం క్షేత్రస్థాయి కార్యక్రమాలకు పునాది వేసినట్టు చెప్పారు. వీటి ద్వారా దేశం ఆర్థికంగా బలపడేందుకు కృషి చేశారన్నారు. 1998లో పోఖ్రాన్ వద్ద ఆయన నాయకత్వంలోనే అణు పరీక్షలు జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు. దేశంలో ఐటీ, టెలికాం విప్లవానికి నాంది పలికి ప్రజలకు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చిన ఘనత వాజ్‌పేయి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

భారత విదేశాంగ మంత్రిగా ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కేవలం రాజకీయాల్లోనే కాకుండా సాహిత్యంలో కూడా వాజ్‌పేయి గొప్ప ప్రతిభ కనబర్చినట్టు పేర్కొన్నారు. వాజ్‌పేయి రచనలు లక్షలాది మందిలో స్ఫూర్తి నింపాయని తెలిపారు.

సుపరిపాలన, ప్రజా సంక్షేమంపట్ల అటల్ బిహారీ వాజ్‌పేయి కనబర్చిన అంకితభావం భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశంగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశ భద్రత, ప్రజల సంక్షేమానికి ఆయన ప్రాధన్యత ఇచ్చినట్టు వెల్లడించారు. వాజ్‌పేయి దూరదృష్టి వల్లే మన దేశం ప్రపం చ దేశాలతో పోటీ పడుతోందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడ్డారు. 

నదుల అనుసంధానంతో అభివృద్ధి

భోపాల్, డిసెంబర్ 25: నదుల అనుసంధానం విషయంలో కీలక ముంద డు గు పడింది. దేశంలో మొట్టమొదటి సారి గా కెన్ నదుల అనుసంధాన ప్రా జెక్టుకు మాజీ ప్రధాని వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా ప్రధాని మోదీ మ ధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రెండు నదుల జలాలను ప్రాజెక్ట్ నమూనాలో పోశారు. అనంతరం రిమోట్ బటన్ సాయంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ నదుల అనుసంధానంతోనే దేశాభివృద్ధి జరుగుతుందన్నా రు.  ప్రజల కోసం తమ ప్రభు త్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.  ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయడానికి ముందు మాజీ ప్రధాని వాజ్‌పేయి పేరిట పోస్టల్ స్టాంప్, రూ.100 నాణాన్ని విడుదల చేశారు. కాగా కెన్ ప్రాజె క్ట్ వల్ల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేకించి బుందేల్‌ఖండ్ ప్రాంతానికి ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. అయితే కాంగ్రెస్  ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించింది.