ఖబరస్తాన్ సమస్యకు పరిష్కారం
స్థానికుల వినతిపై స్పందించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్ , ఆగస్టు 22విజయక్రాంతి : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మల్లాపూర్ కబ్రిస్తాన్లోని మట్టి కొట్టుకుపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కబ్రిస్తాన్లో పూడికలు ఏర్పడి, అంత్యక్రియల నిర్వహణకు ఆటంకాలు కలుగుతున్న.
నేపథ్యంలో ఈ సమస్యను స్థానిక బి ఆర్ ఎస్ నాయకుడు ఎండీ ఉస్మాన్ ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.విషయాన్ని వెంటనే పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి కబ్రిస్తాన్కు అవసరమైన మట్టిని మంజూరు చేయించారు. వర్షాల కారణంగా కొట్టుకుపోయిన ప్రాంతాలను పూడ్చేందుకు ఈ మట్టి ఉపయోగపడనుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తక్షణ స్పందనతో సమస్యకు పరిష్కారం లభించిందని ఎండీ ఉస్మాన్ తెలిపారు. కబ్రిస్తాన్లో మట్టి పూడ్చే పనులు త్వరలో పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, మసీదు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎండీ ఉస్మాన్లకు కృతజ్ఞతలు తెలిపారు.






