calender_icon.png 29 December, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళకు అరుదైన చికిత్స

29-12-2025 09:49:38 PM

వైద్యులను అభినందించిన సూపరింటెండెంట్ శ్రీధర్

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళకు అరుదైన చికిత్స చేసిన వైద్యులను సూపరింటెండెంట్ శ్రీధర్ అభినందించారు. జిల్లాలోని రంగంపల్లి కి చెందిన  ఒక మహిళ(35) తీవ్రమైన కడుపు నొప్పితో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రాగా, వైద్యులు సదరు మహిళకు స్కానింగ్ చేయగా గర్భ సంచి పక్కన ఉన్న  ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ ఏర్పడి అది పగిలి పోయి కడుపులో తీవ్రమైన రక్తస్రావం జరిగి పేషెంట్ కి ప్రాణాపాయ స్థితి ఏర్పడింది.

వెంటనే స్పందించిన డాక్టర్ నయన, గైనకాలజిస్ట్ సదరు పేషెంట్ కి అత్యవసరమైన ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు. ఈ  సర్జరీ లో పాల్గొన్న వైద్యుల  బృందం డాక్టర్ శ్రీనయన, డాక్టర్ రామం, ఓటి సిబ్బందిని ఆసుపత్రి సూపరింటెండెంట్ కె.శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా ప్రజలందరూ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల క్లిష్టమైన శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని, కావున ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకోగలరని సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు