28 May, 2026 | 1:53 AM

2769 పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు

28-05-2026 12:00 AM

అన్ని స్కూళ్లలో ప్రారంభించాలంటున్న టీపీటీఎఫ్

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన విద్యాసంవత్సరానికి 2769 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించనుంది. ఈమేరకు ఈనెల 26న విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఇలా విడతల వారీగా ప్రీప్రైమరీ విద్యను సర్కారు బడుల్లో ప్రవేశపెట్టడాన్ని టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం వ్యతి రేకించింది. గత విద్యాసంవత్సరంలో 1362 పాఠశాలల్లో ప్రీప్రైమరీ ప్రవేశపెట్టిన ప్రభు త్వం..ఈ విద్యాసంవత్సరమైనా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టకుండా కొన్నిం టికే పరిమితం చేయడానని ఆ సంఘం అధ్య క్ష, కార్యదర్శులు సీహెచ్ అనిల్ కుమార్, నన్నెబోయిన తిరుపతి తప్పుబట్టారు.