9 May, 2026 | 2:17 PM

Breaking News

మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •  

రీ ఎంట్రీకి సిద్ధం

02-03-2025 12:47 AM

90వ దశకంలో హీరోయి న్ రంభ పేరు మార్మోగిపోయింది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ ఇలా భాషాభేదం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో తన ముద్ర వేశారామె. నటిగా ఆమె కెరీర్‌లో మరుపురాని క్లాసిక్ చిత్రాలెన్నో! ఆమె గ్లామర్, నటన, గ్రేస్ ఫుల్ స్టెప్పులకు అప్పటి ప్రేక్షకులు ఫిదా అయ్యేవారు.

కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు, నటనకు దూరంగా ఉన్న రంభ రీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. రంభ ఈ విషయాన్ని చెప్తూ.. ‘నా ఫస్ట్ ఛాయిస్ ఎప్పుడూ సినిమానే. ఇక ఇప్పుడు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నా. ఇదే సరైన సమయమని భావిస్తున్నా. కొత్త పాత్రలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకోవాలని చూస్తున్నా’ అన్నారు.

ఇక అభిమానులు ఆమె రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రంభ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో.. ఎలాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.