8 July, 2026 | 1:52 AM

పూర్వ ప్రాథమికం.. వీడని రాజకీయ గ్రహణం!

08-07-2026 01:09 AM
  1. అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనా తెరుచుకోని స్కూళ్లు
  2. ప్రైవేట్ స్కూళ్లలో తరగతుల జోరు.. 
  3. సర్కారు బళ్లలో అడ్మిషన్‌ల ఊసే లేదు..
  4. ఆగిన టీచర్లు, ఆయాల నియామకాలు
  5. బడి తెరిచేదెన్నడు.. పోస్టింగులు తేలేదెన్నడు?
  6. నియామకాల్లో ఒక్కో చోట ఒక్కో రూల్!
  7. రాజకీయ జోక్యంతో నిలిచిన ప్రక్రియ
  8. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిస్థితి అస్తవ్యస్తం

* భువనగిరి పట్టణానికి చెందిన సాయికుమార్ ఓ ప్రైవేటు ఉద్యోగి. నెలకు రూ.23వే ల వేతనం. ఒక్కడే కొడుకు. భార్య ప్రెగ్నేన్సీ కావడంతో వైద్యులు బెడ్ రెస్ట్ ఇచ్చారు. దీంతో సాయి కుమార్ ఒక్కడే ఆ కుటుంబానికి ఆధారం తన రెండున్నరేండ్ల కొడుకును ఎవరైనా పట్టుకుంటేనే తాను డ్యూటీకి వెళ్లే ది. భార్య బెడ్ రెస్ట్ కావడం.. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడంతో కొడుకును పట్టుకునేందుకు ఎవ్వరూ లేరు.

ప్రైవేటుగా ప్లే స్కూల్లో చేర్పిద్దామంటే.. రూ.లక్షల్లో ఫీజు. ఆ ఫీజు కట్టలేక సతమతమవుతున్న సమయంలోనే ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూళ్లను తెరుస్తున్నామంటూ ఆర్భాటపు ప్రకటన చేసింది. దీంతో సాయికుమా ర్ ఎగిరి గంతేసినంత పనిచేశాడు.

కానీ రోజు లు గడుస్తున్నా.. ఆ ప్రీ ప్రైమరీ స్కూళ్లు తెరిచే నాథుడే కరువయ్యాడు. ఇటు ప్రభుత్వం ప్రీప్రైమరీ స్కూల్ను పూర్తిస్థాయిలో నడిపించకపోవడం.. అటు ప్రైవేటు స్కూల్లో వేసేం దుకు డబ్బుల్లేక సాయికుమార్ పడుతున్న మనోవేదన అంతాఇంతా కాదు. ఇది ఒక్క సాయికుమార్ పరిస్థితే కాదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇలాంటి సాయికుమార్లు కోకొల్లలు.

కట్టంగూరు, జూలై 7 : ప్రభు త్వ బడులను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్ది పేద చిన్నారులకు ఎల్కేజీ, యూకేజీ స్థాయి నుంచే ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలన్న సర్కారు ఆశయాలకు క్షేత్రస్థాయిలో రాజకీయ గ్రహణం పట్టింది. అ కాడమిక్ ఇయర్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రీ-ప్రై మరీ పాఠశాలలు నేటికీ కాగితాలకే పరిమితమయ్యాయి.

నియామకాల్లో రాజకీయ జో క్యం, అధికారుల పర్యవేక్షణా లోపం వెరసి.. అటు బడుల్లో సెక్షన్లు తెరుచుకోలేదు.. ఇటు ఒక్క చిన్నారుడూ చేరిన దాఖలాలు లేవు. పాలకుల ఒత్తిళ్లతో విద్యాశాఖ మహాన్నత సంకల్పం కాస్తా ప్రారంభంలోనే అభాసుపాలవుతోంది. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో పూర్వ ప్రాథమికాన్ని రాజకీయ గ్రహణం కమ్మేసిందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

కాగితాలకే పరిమితమైన బడులు.. శూన్యంగా అడ్మిషన్లు.. :

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా (నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగి రి) మొత్తం 282 పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ సెక్షన్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం గతంలో ఆర్భాటంగా ప్రకటించింది. జూన్ 12 నుంచే ఈ తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా, నేటికీ ఎక్కడా ఒక్క సెక్షన్ కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్ల సందడి ముగిసి క్లాసులు నడుస్తుంటే.. ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ బడులలో మాత్రం కనీసం ప్రవేశాల ప్రక్రియే మొదలుకాలేదు.

ఫలితంగా పేద తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కడ చేర్పించాలో తెలియక ప్రైవే ట్ పాఠశాలల వైపు పరుగులు తీస్తున్నారు. పిల్లల జాయినింగ్స్ సంగతి పక్కన పెడితే.. ప్రీప్రైమరీ స్కూళ్లలో కీలకమైన మహిళా ఇ న్స్ట్రక్టర్లు (టీచర్లు), ఆయాల నియామక ప్రక్రియ పూర్తిగా ప్రహసనంగా మారింది.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ ఎంపికకు ఎలాంటి డెడ్లైన్ ప్రకటించకపోవడం స్థానిక అధికారులకు శాపంగా మారిం ది. ఇదే అదనుగా స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. ఫలితంగా ఉ మ్మడి జిల్లావ్యాప్తంగా ఒక్కో మండలంలో ఒక్కో రకమైన నిబంధనలతో ఈ ప్రక్రియ సాగుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 నియామకాల్లో రాజకీయ ఒత్తిళ్లు ; 

ఉమ్మడి జిల్లాలోని కొన్ని గ్రా మాల్లో నిబంధనలను తుంగ లో తొక్కి, స్థానిక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి అధికారులు ఇప్పటికే టీచర్లు, ఆయాల పేర్లను దొడ్డిదారిన ఫైన ల్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరికొన్ని చోట్ల మెరిట్, స్థానికతను పక్కనబెట్టి, తమ వారికి ఇచ్చుకునేందుకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచి ఇంటర్వ్యూల పేరిట కాలయాపన చేస్తూ హడావుడి సృష్టిస్తున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో పాఠశాల విద్యాశాఖ నుంచి క్షేత్రస్థాయి అధికారులకు ఎ లాంటి స్పష్టమైన ఆదేశాలు, మార్గదర్శకాలు లేకపోవడం గమనార్హం. ఉన్నతాధికారులు సైతం జిల్లాలో ఈ ప్రక్రియ ఎంతవరకు వ చ్చింది..?, అసలు క్లాసులు ఎందుకు ప్రా రంభం కాలేదనే అంశాలపై కనీస పర్యవేక్షణ చేయడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

రూ. 1 లక్ష చొప్పున నిధులు కే టాయించి, రంగురంగుల గోడలు, ఆటపాటలతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాలని భా వించిన ప్రభుత్వ మహోన్నత ఆశయం.. అధికారుల ఉదాసీనత, రాజకీయ నాయకుల స్వార్థం కారణంగా నీరుగారిపోతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు స్పందించి రాజకీయ జోక్యానికి అడ్డుకట్ట వే సి, తక్షణమే పారదర్శకంగా నియామకాలు పూర్తి చేసి ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.