పంట మార్పిడి సవాల్!
ప్రత్యామ్నాయ పంటల మార్కెట్ విధానంపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
వరి, పత్తికి బదులు ఇతర పంటలు వేయాలంటున్న సర్కారు
క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించని వ్యవసాయ అధికారులు
ప్రకటనలకే ప్రభుత్వం పరిమితమవుతుందని విమర్శలు
ఏ పంట వేయాలన్నదానిపై రైతుల్లో ఆందోళన
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, నేల సారాన్ని కాపాడేందుకు పంటల మార్పిడి ఎంతో అవసరం. ఒకే పంటను పదే పదే వేయడం వల్ల భూమిలో పోషకాలు తగ్గి.. పంట దిగుబడి కూడా తగ్గుతుంది. అంతే కాకుండా పంట మార్పిడి వల్ల పురుగులు, తెగుళ్లు కూడా తగ్గుతాయి.
వరి, పత్తికి బదులుగా పప్పుధాన్యాలు, ఆయిల్‌పామ్, మామిడి, బొప్పాయి, నూనె గింజలు, జొన్న, మొక్కజొన్న, నువ్వులు, పొద్దు తిరుగుడు, కుసు మలు, శనగలు, పెసర్లు, సజ్జ కూరగాయ లు ఇతర పంటలు పండించాలని తెలంగాణ ప్రభుత్వం సూచిస్తోంది. అందుకు జిల్లాల వారీగా కూడా ప్రభుత్వం ప్రణా ళిక రూపొందించింది. అయితే దశాబ్దాలు గా వరి సాగుకే అలవాటు పడిన రైతులకు ఇప్పుడు పంట మార్పిడి అనేది పెద్ద సవాల్‌గానే మారనుంది.
వరి పంటకు ఉన్న మార్కెటింగ్ సౌకర్యం, నీటి లభ్యత ఇతర పంటలకు ఉంటుందా? అన్నది రైతుల ప్రధాన సందే హం. పంట మార్పి డి అంశం కేవలం ఆదేశాలతోనే జరగదని, ప్రత్యామ్నాయ పంటలకు గ్యారెంటీ ధర, కొనుగోలు భరోసా కల్పిస్తేనే సాధ్యమవుతుందని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర ప్రభు త్వం కూడా ఈ ఏడాది 25 లక్షల వరకు వరి సాగు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వానికి టార్గెట్ విధించింది. కేంద్రం నిర్దేశించిన ఈ భారీ టార్గెట్‌ను రాష్ట్రం ఎలా అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ వ్యవసాయం ఇప్పుడు వరి నీడ నుంచి బయటకు వచ్చి వాణి జ్య పంటల బాట పట్టాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. అయితే వరి సాగు తగ్గించి ఇతర పంటల వైపు రైతులను మళ్లించడం వల్ల మార్కెట్ లో సమతుల్యత వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతుల ను ఒప్పించడం అంత సులభం కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ధాన్యం ఎక్కువ.. పప్పులు తక్కువ
రాష్ట్రంలో ఒకవైపు వరి నిల్వలు పేరుకుపోతుంటే, మరోవైపు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మన అవసరాలకు సరిపడా ఇవి ఇక్కడ ఉత్పత్తి కాకపోవడంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే వరిని తగ్గించి, ఆ భూముల్లో ఆయిల్ పామ్, పప్పుధాన్యాలు, వాణిజ్య పంటలు వేయడం ద్వారా రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించవచ్చని కేంద్రం సూచిస్తోంది.
రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 2.5 కోట్ల ఎకరాల్లో వరి సాగును తగ్గించాలని నిర్ణయించగా, అందులో ఏకంగా 10 శాతం అంటే 25 లక్షల ఎకరాలు బాధ్యతను ఒక్క తెలంగాణకే అప్పగించింది. గడిచిన మూడేళ్లలో తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం 16 లక్షల ఎకరాల మేర పెరిగి, ప్రస్తుతం 133 లక్షల ఎకరాలకు చేరుకుంది.
ఏటా సుమారు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది. యాంత్రీకరణ పెరగడం, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఉండటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ. 500 బోనస్ పథకం రైతులకు వరిపై మరింత మక్కువ పెంచింది. ఫలితంగా కేంద్ర గోదాముల్లో ధాన్యం నిల్వలు నిండిపోయి, కొత్త పంటను నిల్వ చేసేందుకు స్థలం లేని పరిస్థితి ఏర్పడింది.
ఈ కారణంగానే ఏటా 5 లక్షల ఎకరాల చొప్పున వరిని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాల వారిగా పంట మార్పిడికి సంబంధించి ప్రణాళికను రూపొందించింది. అందుకు పంట మార్పిడిపై ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారుల ద్వారా రైతుల్లో అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకన్నది. అయితే ఈ పంట మార్పిడి విధానంపై ప్రభుత్వం ప్రకనటలకే పరిమితమైందని, క్షేత్ర స్థాయిలో వెళ్లి రైతులకు పెద్దగా అవగాహన కల్పించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.






