మనుమడిని పరామర్శించిన కేసీఆర్
08-07-2026 12:59 AM
- ఆడుతుండగా కిందపడి గాయపడిన హిమాన్ష్
- గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
శేరిలింగంపల్లి, జూలై 7 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన మనుమడు హిమాన్షును మంగళవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో పరామర్శించారు. సోమవారం సాయంత్రం క్రీడలు ఆడుతుండగా కిందపడటంతో హిమాన్షు స్వల్పం గా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. వైద్యు లు చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం హిమాన్షు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గా లు తెలిపాయి. విషయం తెలుసుకున్న కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం ఆసుపత్రికి చేరుకున్నారు. మనవడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు హిమాన్షు వద్దనే ఉండి ధైర్యం చెప్పారు. పరామర్శించిన అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.






