28 June, 2026 | 2:13 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాల బహుకరణ, చెక్కుల పంపిణి

14-03-2026 10:14 PM

పాల్వంచ,(విజయక్రాంతి): నవ లిమిటెడ్ పాల్వంచ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రం నందు బ్యూటీషన్, టైలరింగ్, ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్, ఏంబ్రాయిడరీ కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శనివారం యోగ్యత పత్రాల అందజేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా యాదాద్రి జిల్లా పోచంపల్లి రామస్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ చైర్మన్ డాక్టర్. ఎన్. కిషోర్ రెడ్డి హాజరయ్యారు. 

ఈ సందర్బంగా బ్యూటిషన్ కోర్సులో శిక్షణ తీసుకున్న ఆర్. నందిని మాట్లాడుతూ మహిళా సాధికార కేంద్రం తమ లాంటి వారికి ఎందరికో ఉచిత శిక్షణ అందిస్తూ ఉపాధి అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. అతిధుల చేతులమీదుగా బ్యూటీషన్, టైలరింగ్, కంప్యూటర్ ఏంబ్రాయిడరీ, ఆఫీస్ ఆటోమేషన్ యోగ్యత పత్రాలు, దుస్తుల తయారీ,, తాటాకుల బుట్టల తయారీ ద్వారా రూ 1,07,641/- వచ్చిన నగదు చెక్కులను అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళలు ఆర్ధికంగా ఏదగడానికి 'నవ' చేస్తున్న కృషిని కొనియాడారు. 

అనంతరం ఎమ్. శ్రీనివాసరావు, మహిళా సాధికార కేంద్ర ప్రతినిధి  మాట్లాడుతూ ఈ మహిళా సాధికార కేంద్రంలో ఇప్పటి వరకు 4,600 మందికి పైగా వివిధ కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్నారని, అలాగే 75% మంది మహిళలు సొంతగా ఇంటిలో టైలరింగ్, బ్యూటీషన్ పనులు చేసుకుంటున్నారని మరికొంత మంది సొంత వ్యాపారాలు చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ వెంకటేశ్వర్లు రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఏ. శ్రీనివాస్ రెడ్డి, డి. జి. ఎమ్ (హెచ్ఆర్&ఏ), ఆముద, టి.అరుణ, బి.అరుణ, కవిత దివ్య, శిరీష,రాజేశ్వరావు. రాజేష్ విద్యార్థులు పాల్గొన్నారు.