స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ
అందజేసిన కాంగ్రెస్ సీనియర్ నేత కే మురళీధర్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 3(విజయక్రాంతి): హిమాయత్‌నగర్ లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో బోయ భీమన్న అవార్డు గ్రహీ త, సీనియర్ కాంగ్రెస్ నేత కే మురళీధర్‌రెడ్డి శుక్రవారం కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్లకు పట్టు వస్త్రా లు సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు తూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన సుభిక్షంగా సాగుతుంది అని తెలిపారు.
పేద ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, మ హిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మ హిళలకు ఉచిత బస్సు, సిలిండర్ రాయితీ, ఇందిరమ్మ ఇండ్లు ,రైతుబంధు ఇస్తూ పేదల కడుపు నింపాలన్న లక్ష్యంతోనే సన్న బియ్యం ఇచ్చి పేద ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డికి వేం కటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ ఆశీస్సులు కలిగి నిండు నూరేళ్లు ఆయురారోగ్యా లతో ఉండాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మురళీధర్ రెడ్డి ఆకాంక్షించారు.




