9 May, 2026 | 2:37 AM

పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అండగా ధర్మవరం బ్రహ్మం దంపతులు

09-05-2026 12:00 AM

జయశ్రీ వివాహానికి పుస్తె మట్టెలు అందజేత

సిద్ధిపేట, రూరల్ మే 8: సమాజ సేవలో మరోసారి తమ పెద్దమనసును చాటుకున్నా రు 38వ వార్డ్ కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం దంపతులు. సిద్దిపేట రూరల్ మండలం రావురూకల గ్రామానికి చెందిన పేద కు టుంబం కుపిరాల మణెమ్మ భూదయ్య దం పతుల కుమార్తె జయశ్రీ వివాహానికి ధర్మవరం స్వప్న బ్రహ్మం దంపతులు పుస్తె, మ ట్టెలను అందజేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం మాట్లాడుతూ, పేద ఆడపిల్ల ల పెళ్లిళ్లకు సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. అవసరంలో ఉన్న కుటుంబాలకు తమ వంతు చేయూత ఎల్లప్పుడూ కొనసాగుతుందని పేర్కొన్నారు. తమ కుమార్తె వివాహానికి ఆర్థికంగా తోడ్పాటు అందించిన స్వప్న బ్రహ్మం దంపతులకు మణెమ్మ, భూదయ్యలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెళ్లికుమార్తె అన్నతో పాటు కుటుంబ సభ్యులు,పెద్దలు, పాల్గొన్నారు.