కొత్తగా ఎన్నికైన ఎంపీలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు
27-06-2024 11:49 AM
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రసంగించారు. కొత్తగా ఎన్నికై వచ్చిన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సారి ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనన్నారు. ఈ ఎన్నికల గురించి ప్రపంచమంతా చర్చించుకుంటోందని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటేశారని పేర్కొన్నారు. దేశంలోని మహిళలు పెద్దసంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారన్న ద్రౌపది ముర్ము తమ ప్రభుత్వం 10 ఏళ్లుగా దేశాభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. అమృతకాలం మొదట్లో 18వ లోక్‌సభ కొలువుదీరిందని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.






