25 July, 2026 | 9:35 PM

జీవన్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలీకృతం

27-06-2024 11:20 AM

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తుంది. చర్చలు సఫలం కావడం పట్ల మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి డిల్లి వెళ్లిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దిపదాస్ మున్షీ తో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే. సీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయని, ఇక పై పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా జీవన్ రెడ్డితో కలిసి చర్చించి తీసుకుంటామని, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తుందని, పార్టీలో వారికి సముచిత స్థానం ఉంటుందని సమావేశం అనంతరం వారు స్పష్టం చేశారు.