25 July, 2026 | 7:41 PM

జులై 1 నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు: రాష్ట్రపతి ముర్ము

27-06-2024 12:05 PM

న్యూఢిల్లీ: నాలుగోరోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించిరాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. జులై 1 నుంచి కొత్త నేర చట్టాలను అమల్లోకి రానున్నాయని పేర్కొన్నారు. నీట్ తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.