22-11-2025 12:37:27 PM
సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం నా అదృష్టం.
సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం.
సత్యసాయి అనేకమందిని సేవామార్గంలో నడిపించారు.
అమరావతి: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరిగిన శ్రీ భగవాన్ సత్యసాయి బాబా(Sathya Sai Baba Centenary Celebrations) 100వ జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని రాష్ట్రపతి, సీఎం, మంత్రులు దర్శించుకున్నారు. సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహా సమాధిని రాష్ట్రపతి(President Droupadi Murmu) దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ... సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం నా అదృష్టం అన్నారు.
విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని ముర్ము తెలిపారు. సత్యసాయిబాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని కొనియాడారు. సత్యసాయి సందేశంతో కోట్లమంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని వెల్లడించారు. సత్యసాయి సందేశంతో అనేక మంది సేవామార్గంలో నడిపించారని రాష్ట్రపతి పేర్కొన్నారు. సత్యసాయి ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని రాష్ట్రపతి పేర్కొన్నారు. సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతోమందికి వైద్యసేవలు అందించారని చెప్పారు. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పుట్టపర్తి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు.