22-11-2025 11:59:46 AM
విజయవాడ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి శనివారం పుట్టపర్తికి చేరుకున్నారు. రాష్ట్రపతి ముర్ము పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. నిన్న హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం వీడ్కోలు పలికారు. హైదరాబాద్ పర్యటన ముగించుకొని పుట్టపర్తికి ప్రయాణమైన సందర్భంగా హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు.