calender_icon.png 22 November, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రధాని మోడీ

22-11-2025 08:49:49 AM

జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 శిఖరాగ్ర సదస్సు.. హజరుకానున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా పర్యటిస్తున్నారు. జీ-20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ(Prime Minister Modi) జోహన్నెస్‌బర్గ్‌ వెళ్లారు. ప్రధానమంత్రి మోదీ శుక్రవారం దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన టెక్ వ్యవస్థాపకులు(Indian origin tech entrepreneurs), భారతీయ సమాజ సభ్యులతో సంభాషించారు. భారత్ లో వారి సంబంధాన్ని మరింతగా పెంచుకోవాలని పిలుపునిచ్చారు.. జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో మోదీ భేటీ అయ్యారు. రక్షణ, అణు ఇంధనం సహా పలు రంగాల్లో పరస్పర సహకారంపై నేతలు చర్చించారు. నాస్పర్ ఛైర్మన్ కూస్ బెక్కర్ తో ప్రధాని మోదీ విడిగా సమావేశం అయ్యారు. భారత్ డిజిటల్ పర్యావరణ వ్యవస్థలో పెట్టుబడుల విస్తరణపై మోదీ చర్చించారు.