10 April, 2026 | 1:46 AM

రాష్ట్రపతి సాహసయాత్ర!

29-12-2025 01:16 AM

జలాంతర్గామిలో సవారీ

బెంగళూరు డిసెంబర్ 28: రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము ఆదివారం సబ్ మెరైన్‌లో ప్రయాణించారు.  కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరం నుంచి కల్వరి క్లాస్ జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్’లో బయలుదేరారు. నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి రాష్ట్రపతి వెంట ఉన్నారు. అబ్దుల్ కలాం అ నంతరం కల్వరి క్లాస్  సబ్ మెరైన్ లో ప్ర యాణించిన రెండో రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. ఇదిలా ఉండగా 2 నెలల క్రితం కూ డా రాష్ట్రపతి ముర్ము ఇలాంటి సాహసం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రఫేల్‌లో ఆమె గగన విహారం చేశా రు.   2023, మే 8న కూడా ద్రౌపది ముర్ము అస్సాంలో సుఖోయ్ 30 యుద్ధ విమానం లో కూడా  పయనించారు. తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి విమానంలో విహరిం చారు.  ఇలాంటి ప్రయాణం చేసిన రెండో మహిళా రాష్ట్రపతిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2009లో యూపీఏ హయాం లో అప్పటి రాష్ట్రపతి  ప్రతిభా పాటిల్ కూడా ఇదే ఫైటర్ జెట్లో గగన విహారం చేసి రికార్డు సృష్టించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైతం 2006లో పుణె ఎయిర్‌ఫోర్స్ స్థావరం సుఖోయ్ 30 యుద్ధ విమానంలో ప్రయాణించారు.