calender_icon.png 29 December, 2025 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఆపరేషన్ సిందూర్’ అందరికీ గర్వకారణం

29-12-2025 01:14:47 AM

2025 చివరి మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ఆనందాలు, విజయాలను గుర్తు చేసుకున్న ప్రధాని 

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ‘ఆపరేషన్ సిం దూర్ ప్రతి భారతీయుడికి గర్వకారణం మని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్’ 129వ ఎపిసోడ్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసం గించారు. 2026 సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో, ప్రధాని గత సంవత్సరం నాటి కీలక ఘట్టాలను గుర్తు చేసుకున్నారు. దేశానికి గర్వం, ఐక్యతను తీసుకొచ్చిన సంఘటన ల గురించి మాట్లాడారు. ఈ సంవత్సరం (2025) దేశంలో భారతీయులు గర్వపడటానికి, ఆత్మవిశ్వాసంతో ఉండటానికి అనేక కా రణాలను ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రసంగంలో ప్రధానంగా ’ఆపరేషన్ సిం దూర్’పై మోదీ దృష్టి సారించారు. ‘ఈ ఆపరేషన్ జాతీయ భద్రత, సార్వభౌమాధికారం పై దేశం దృఢమైన వైఖరిని ప్రతిబింబించింది. ఈ సంవత్సరం, ‘ఆపరేషన్ సింధూర్’ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారిం ది. నేటి భారతదేశం తన భద్రత విషయంలో రాజీ పడదని ప్రపంచం స్పష్టంగా చూసింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో, మాతృభూమి పట్ల ప్రేమ, భక్తికి సంబంధించిన చిత్రాలు ప్రపంచ నలుమూలల నుంచి వెలువడ్డాయి’ అని ప్రధాని మోదీ అన్నారు.

వందేమాతరం 150 సంవత్సరాలు

ఆపరేషన్ సిందూర్ సమయంలో కనిపించిన స్ఫూర్తిని ప్రధాని మోదీ జాతీయ గర్వా నికి సంబంధించిన ఇతర క్షణాలతో ముడిపెట్టారు. వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, భారతదేశం-పాకిస్తాన్ సంఘర్షణ సమయం లో దేశవ్యాప్తంగా అదే భక్తి, దేశభక్తి భావన కనిపించిందని పేర్కొన్నారు. ఇటువంటి క్షణాలు జాతీయ ఐక్యతను బలోపేతం చేస్తాయని, దేశం పట్ల పౌరుల ఉమ్మడి విలువ లు, సామూహిక బాధ్యతను గుర్తు చేస్తాయ న్నారు. గత సంవత్సరం నాటి ఈ ఉమ్మ డి అనుభవాలు భవిష్యత్‌కు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాని పేర్కొన్నారు. 2025 సంవ త్సరంలో భారతీయులు ప్రదర్శించిన గర్వం, ఐక్యత, నిబద్ధత దేశం కొత్త సంవత్సరంలోకి ముందుకు సాగుతున్నప్పుడు దానికి మార్గదర్శకంగా ఉంటాయని ఆయన అన్నారు.