నిత్యవసర సరుకులు ధరలు తగ్గించాలి
ఎర్రుపాలెం జూన్ 16 (విజయ క్రాంతి): మండల కేంద్రంలోని మంగళవారం నాడు కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య భవనం నందు రౌండ్ టేబుల్ సమావేశం సంఘం అధ్యక్షులు నాగులవంచ వెంకటరామయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంఘం మండల ప్రధాన కార్యదర్శి గామాసు జోగయ్య మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని అవేదన వ్యక్తం చేశారు.
రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజలు పౌష్టిక ఆహారం లేక రక్తహీనతతో వ్యాధులతో బాధపడుతున్నారని యుద్ధం పేరుతో గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచి రవాణా చార్జీలు అధికంగా ఉన్నాయని కూరగాయలు నిత్యవసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగాయని దీనివల్ల ప్రజల కు ఆరోగ్య సమస్య గా తలెత్తుతుందని వాపోయారు.
వ్యవసాయ కూలీలకి , పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ అనంతరం రాష్ట్ర మహాసభల సందర్భంగా వెంకటాపురం గ్రామంలో తాళ్లూరు వెంకటనారాయణ సంఘం జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కుడెల్లి నాగేశ్వరావు, షేక్ నగుల్ మీరా,పుటేటి వెంకట నారాయణ రెడ్డి, మస్తాన్, భసవయ్య,నక్క పుల్లరావు, కోల రామకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






