24 April, 2026 | 9:32 PM

వాసవి మాత దేవాలయం అర్చకులు మహేష్ రజిత దంపతులకు ఘనంగా సన్మానం

24-04-2026 08:23 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వాసవి మాత దేవాలయం అర్చకులు వల్ల కొండ మఠం మహేష్ రజిత దంపతుల పెళ్లిరోజు ను పురస్కరించుకొని వాసవి మాత దేవాలయం భక్త బృందం, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ  ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కొమురవెల్లి రామ్మూర్తి, వాసవి మాత దేవాలయం చైర్మన్ చకిలం మారుతి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్,  క్యాషియర్ కొమురవెల్లి (కేబి)  శ్రీనివాస్, శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి అల్లంకి లింగమూర్తి, సామాజిక సేవకులు పల్ల కిషన్,

ఆర్యవైశ్య సంఘం నాయకులు పల్ల అశోక్, అల్లంకి అరుణ్, నార్ల శ్రీనివాస్, తాటి పెళ్లి  భూపతి, సిరిపురం రమేష్, అల్లంకి హరీష్, మాడిశెట్టి అంజయ్య,  కొమురవెల్లి సత్యం,  పుల్లూరి రమేష్, పల్ల అనిల్, నాగమల్ల ప్రశాంత్, రామిడి రవీందర్,  నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మహేష్ రజిత దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు, అలాగే పట్టణంలోని శివాలయంలో అర్చకులు వల్ల కొండ మఠం రమేష్ శైలజ  దంపతులు , భక్త బృందం మహేష్ రజిత దంపతుల ను ఘనంగా సన్మానించారు.