calender_icon.png 16 October, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సున్నిపెంట హెలీప్యాడ్ కు చేరుకున్న ప్రధాని మోదీ

16-10-2025 11:10:23 AM

హైదరాబాద్: కాసేపట్లో శ్రీశైలం మల్లన్నను ప్రధాని మోదీ(Prime Minister Modi) దర్శించుకోనున్నారు. భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి పూజలు చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్ లో శ్రీశైలానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ వెంట చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ శ్రీశైలం వెళ్లారు. కాసేపట్లో సున్నిపెంట హెలీప్యాడ్ కు ప్రధాని చేరుకుంటారు. సున్నిపెంట హెలీ ప్యాడ్(Sunnipenta helipad) నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలానికి వెళ్లనున్నారు. మోదీ పర్యటన సందర్భంగా పలు చోట్ల వాహనాలు మళ్లించారు. ఈగల పెంటలో వాహనాలు నిలిపివేశారు. ప్రధాని పర్యటన దృష్ట్యా పోలీసులు కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శ్రీశైలం, సున్నిపెంట ప్రాంతాల్లో 1500 మంది పోలీసులు భద్రతలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ప్రధాని మోడీకి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానికి స్వాగతం పలికారు.