16-10-2025 11:40:47 AM
వాట్సప్ గ్రూపుల్లో ఫేక్ లింక్స్ పంపుతున్న నేరగాళ్లు
ఫేక్ లింక్స్ క్లిక్ చేయవద్దని సైబర్ పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్: ప్రజలను మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలు వెలుగుచూస్తున్నాయి. సైబర్ నేరగాళ్ల వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ లింక్స్ పంపుతున్నారు. ఆయా పథకాలకు అర్హత చెక్ చేసుకోవాలంటూ లింకులు పంపి మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. తొందరపడి ఎవరూ ఫేక్ లింక్స్ క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. అధికారిక వెబ్ సైట్లు మాత్రమే చూడాలని పోలీసులు సూచించారు. అపరిచితులు పంపే లింక్ లు , మోసేజ్ లకు స్పందించ వద్దని పోలీసులు సూచించారు.