16-10-2025 10:21:16 AM
హైదరాబాద్: ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. కర్నూలు నుంచి సైనిక హెలికాప్టర్ లో ప్రధాని శ్రీశైలం( Srisailam Mallikarjuna Temple) వెళ్లనున్నారు. శ్రీశైల క్షేత్రాన్ని ప్రధాన మంత్రి దర్శించుకున్నారు. భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూజల అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శ్రీశైలంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం, సున్నిపెంట ప్రాంతాల్లో 1500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు.