16 July, 2026 | 10:51 AM

సుధమ్మ ప్రసంగానికి ప్రధాని ప్రశంసలు

04-07-2024 01:36 AM
  1. రాజ్యసభలో తొలిసారి ప్రసంగించిన రచయిత్రి
  2. బాలికలకు సర్వైకల్ టీకా ఆవశ్యకతపై వివరించిన ఎంపీ

న్యూఢిల్లీ, జూలై 3: రచయిత్రి సుధామూర్తి ఎంపీగా రాజ్యసభలో తొలిసారి చేసి న ప్రసంగం ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్యంపై చేసిన ప్రసంగాన్ని ప్రధాని మోదీ ప్రశంసించి కృతజ్ఞతలు తెలిపారు. సుధామూర్తి ఇటీవలే ఎగువసభకు నామినేట్ అయ్యారు. ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ.. 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలకు సర్వైకల్ వ్యాక్సిన్ ఇస్తారని, ఆ టీకా తీసుకుంటే క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చన్నారు. చికిత్స కంటే నివారణే మేలు అని, ఈ సందర్భంగా తన తండ్రి మాటలను సుధామూర్తి గుర్తు చేసుకున్నారు.

కొవిడ్ సమయంలో దేశవ్యాప్తం గా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించామ ని, ఆ అనుభవంతో సర్వైకల్ టీకాను బాలికలకు అందించడం సులభమని తెలిపారు. దీ ంతో పాటు వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన అవసరాన్ని సుధామూర్తి వివరి ంచారు. ఆమె చేసిన ప్రసంగంపై ప్రధాని స్పందిస్తూ మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా మాట్లాడిన సుధామూర్తికి కృతజ్ఞతలని అన్నారు. పదేళ్లకాలంలో మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు.