అభివృద్ధికే మొదటి ప్రాధాన్యత
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత అని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 59,60వ డివిజన్ లలో రూ.10 లక్షల చొప్పున మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.ఈ పనులు పూర్తయిన అనంతరం స్థానిక కాలనీల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు , కార్పొరేటర్లు మజీద్ హుస్సేన్, నసీం సుల్తానా ఇబ్రహీం, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.






