తల్లిపాలే బిడ్డకు వరం
చంద్రుపట్ల సెక్టార్‌లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు మండల పరిధిలోని చంద్రుపట్ల సెక్టార్‌లో ఓబుల్‌రావు బంజర, పాయపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ముచ్చవర-2, బాలాజీనగర్, పాయపూర్ అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సర్పంచ్ కోలేటి శ్రీను, ఓబుల్‌రావు బంజర సర్పంచ్ మలోతు అనురాధలు మాట్లాడుతూ... తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
పుట్టిన బిడ్డకు తల్లిపాలు అత్యంత పోషకాహారంగా ఉండటంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. చిన్నారులకు సమయానికి టీకాలు వేయించడం చాలా అవసరమని సూచించారు. అలాగే గర్భిణీలు, బాలింతలు పరిశుభ్రత పాటించడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు.






