19 March, 2026 | 2:39 AM

పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

19-03-2026 01:02 AM

అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్

కొల్లాపూర్ టౌన్ , మార్చి 18: కొల్లాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని బుధవారం అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ సందర్శించి పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రగతి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి, పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగించాలని, మురుగునీటి కాలువలు, రోడ్లు శుభ్రంగా ఉంచాలని సూచించారు.

అలాగే 100% పన్ను వసూళ్లపై దృష్టి పెట్టాలని తెలిపారు.నూతన మున్సిపల్ భవనం నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి పరీక్షలు సజావుగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్ షేక్ రహీం పాషా, కమిషనర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.