19 March, 2026 | 7:10 AM

ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలి

19-03-2026 01:01 AM

అదనపు కలెక్టర్ భాస్కరరావు

ఆలేరు, మార్చి 18 : బుధవారం ఆలేరు, మోటకొండూరు ల లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ సి పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ భాస్కరరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పరీక్షా కేంద్రంలో నిర్వహణ ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా  రాయాలని సూచించారు,

పరీక్షా కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు తదితర అంశాల గురించి అడిగి తెలుసున్నారు, పరీక్ష పూర్తయిన తర్వాత పోలీస్ బందోబస్తుతో పరీక్ష పేపర్లను జాగ్రత్తగా తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.