8 April, 2026 | 4:43 AM

నకిలీ బెయిల్ పేపర్స్.. జైలు నుంచి విడుదలైన ఖైదీ

01-12-2024 11:30 AM

హైదరాబాద్: ఓ ఖైదీ చంచల్ గూడ పోలీసులనే మోసం చేశాడు. నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి ఓ ఖైదీ జైలు నుంచి విడుదలయ్యాడు. చంచల్ గూడ జైలు నుంచి గత నెల 26న ఖైదీ సుజాతలి ఖాన్(27) విడుదలయ్యాడు. బెయిల్ వచ్చినట్లు నలికీ పత్రాలు జైలు అధికారులకు ఇచ్చి నిందితుడు బయటకు వచ్చాడు. ఆన్ లైన్ లో బెయిల్ పత్రాలు రాకపోవడంతో నకిలీవిగా పోలీసులు గుర్తించారు. భూకబ్జా, మోసం కేసుల్లో సుజాతలి ఖాన్ ను నవంబర్ 2న నార్సింగి పోలీసులు అరెస్ట్  చేశారు.