07-12-2025 01:16:32 AM
-కరెన్సీ హెచ్చుతగ్గులు సర్వసాధారణం
-అవి ఆర్థిక వ్యవస్థ పనితీరుకు ప్రామాణికం కాబోదు !
-కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: అంతర్జాతీయ రూపాయి విలువ పతనం ప్రతికూలం కాదు. అది సర్వసాధారణం. రూపాయి విలువ తగ్గినప్పుడు.. మన ఎగుమతిదారులు ఆ తగ్గుదల అంశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇది నేను కచ్చితంగా చెప్పగలను. మన ఉత్పత్తులపై విదేశాల్లో సుంకాలు పెరుగుతున్న వేళ ఇదికాస్త సానుకూలమైన అంశం. కరెన్సీ హెచ్చుతగ్గులు ఆర్థిక వ్యవస్థ పనితీరును నిర్ణయించలేవు’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్ఠస్థాయికి పడిపోవడంపై శనివారం ఆమె ‘హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్’ వేదికగా ప్రసంగించారు. రూపాయి పతనం వంటి పరిస్థితులు ఎగుమతిదారులకు ప్రయోజనకరమేనని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని కొ నియాడారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పు డు కంటే, అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉందని చెప్పుకొచ్చారు. దేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రూపాయిపై చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. యా వత్ దేశవ్యాప్తంగా ఒక కుటుంబ పొదుపు తగ్గుతోందన్న ఆందోళనలను తోసిపుచ్చారు. పైగా ఆస్తులు పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.