అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు!
కాంగ్రెస్ అరాచకాలపై అసెంబ్లీలో నిలదీస్తాం
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ భేటీ
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీ అమలు కోసం అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలకు కాంగ్రెస్ చేసిన మోసాలు, నిరంతర అరాచకాలపై అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు.
అధికారంలోకి రాగా నే తొలి క్యాబినెట్ సమావేశంలోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఆ హామీని మరిచిపోయిందని కేటీఆర్ అన్నారు అందుకే ఆరు గ్యారెంటీల ద్వారా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఈ బిల్లు ద్వారా ఎండగడ తామన్నారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఇస్తామని రాహుల్‌గాంధీతో సహా కాంగ్రెస్ పెద్దలు చెప్పి మోసగించడాన్ని కూడా ఈ బిల్లు ద్వారా శాసనసభలో ఎండగడ తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మంగళవారం గోల్కొండ రిసా ర్ట్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఉమ్మడి ఓరియంటేషన్ సమావేశం ముగిసిన అనంతరం పార్టీ సీనియర్ నేతలతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈసారి కాంగ్రెస్ పెడుతున్న బడ్జెట్.. మూడవ బడ్జెట్ అని, ఈసారి బడ్జెట్ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని ఆయన అన్నారు.
ఇప్పటికే సగం ప్రభుత్వ పదవీ కాలం అయిపోయిందని, హామీల అమలులో ప్రజలు ఇచ్చిన వ్యవధి అయిపో యిందన్నారు. వారి హా మీల అమలు వైఫల్యాన్ని మోసాన్ని ఎండగట్టేందు కు ఈ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూ హం పైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా అసెంబ్లీలో ఏ కమిటీలను వేయడం లేదన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీని మా పార్టీ నుంచి ద్రోహం చేసి పోయిన వ్యక్తికి ఇచ్చారని, ఒక్క సెలెక్ట్ కమిటీ లేదు, స్టాండింగ్ కమిటీ లేదు, పిటిషన్స్ కమిటీ లేదని విమర్శించారు. శాసనసభలో డిప్యూటీ స్పీకర్ కూడా లేరని, కేవలం అనివార్యంగా శాసనసభ సమావేశాలను ప్రభుత్వం బలవంతంగా నడిపిస్తున్నదని తెలిపారు.
బుల్డోజర్ టాక్టిక్స్..
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బుల్డోజర్లను పంపి ఇళ్లను కూలగొడుతున్న తీరుగానే శాసనసభలోనూ మందబలంతో బుల్డోజర్ టాక్టిక్స్‌ని ప్రయోగిస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. శాసనసభ, శాసనమం డలి సమావేశాల్లో అబద్ధాలను, అసత్యాల ను పచ్చిగా మాట్లాడుతూ అంకెల ను తారుమారుచేస్తూ శాసనసభ సమావేశాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి అసెంబ్లీలో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలంగా నిల దీయడం కోసమే ఈ సమావేశాన్ని తమ పార్టీ ఏ ర్పాటు చేసుకున్నదన్నారు.
రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి.. రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు బంధును మాత్రం పక్కన పెట్టాడన్నారు. ఖమ్మంలో ప్రభుత్వ దాష్టీకం వల్ల ఇళ్లు కోల్పోయిన వెలుగుమట్ల తరపున, మూసీ బాధితు ల తరపున, పేద దళిత గిరిజన ప్రజల కోసం ఈ అ సెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.
అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీని, లేని అప్పులను ఉన్నవిగా చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధాలను అంకెలతో సహా ఎండగడతామన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దళి త, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇస్తామన్న ని ధులు ఎందుకు కేటాయించలేదో నిలదీస్తామని, ఈ రోజు జరిగిన సమావేశాల మాదిరి భవిష్యత్తులో నూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు, 420 హామీల అమలుకు డబ్బులు లేవని చెప్తున్నదని, రైతన్నలకు, మహిళలకు, విద్యార్థులకు ఇచ్చిన హా మీలకు డబ్బులు లేవని చెప్తున్నదని, కానీ వీటన్నింటినీ పక్కన పెట్టి మూసీ పేరుతో అవినీతి కార్య క్రమానికి తెరలేపిందని ఆరోపించారు. తాము మూ సీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని, కానీ ఒకవైపు డబ్బులు లేవు, అప్పులయ్యాయని చెబుతూనే మూ సీలో లక్షన్నర కోట్ల రూపాయల అవినీతితో లక్షలాది మంది ఇళ్లను కూలగొట్టడాన్ని మాత్రమే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన చేయడం లేదు, కేవలం ఢిల్లీకి డబ్బులు పంపించడం కోసమే మూసీ ప్రాజెక్టును చేపడుతున్నారని, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను జీరో వ్యాల్యూ చేయడం కాదు, అసలు జీరో వ్యాల్యూ ఎవరికైనా ఉన్నది అంటే అది రేవంత్ రెడ్డికే అన్నారు. రేవంత్ రెడ్డి మాటలకు ముమ్మాటికీ జీరో విలువ ఉన్నదని, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదని కేటీఆర్ అన్నారు. తాను తీసుకున్న నిర్ణయాలు కూడా తనకే తెలియదని సీఎం చెప్తున్నాడని విమర్శించారు.
డే ఎకానమీని నాశనం చేసిన వ్యక్తి నైట్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాడని, రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా రాహుల్ బంధు పథకాన్ని పక్కన పెట్టి రైతుబంధు కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. రెండున్నర సంవత్సరాలలో ఒక్క ఇల్లు అయినా కాంగ్రెస్ పార్టీ కట్టిందని అంటే తాను రాజీనామా చేస్తానని చెప్పాను, దానికి నేను ఇంకా కట్టుబడి ఉన్నానని, తాము కట్టిన ఫ్లైఓవర్లు, ఇళ్లు, ప్రాజెక్టులకు రంగులు పూసి మావి అని కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి చెప్పుకుంటున్నారని విమర్శించారు.
బడ్జెట్ సమావేశాలపై బీఆర్‌ఎస్ వ్యూహం!
అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వ్యూహ రచనలతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా అమీతుమీకి రెడీ అవుతోంది. ఇందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంగళవారం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శాసనసభ, శాసనమండలిలో ప్రజాప్రతినిధులు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపైన సబ్జెక్టు నిపుణలతోనే శిక్షణ ఇచ్చినట్లుగా సమాచారం.
దీనికితోడూ సభలో లేవనెత్తాల్సిన ముఖ్యమైన ప్రజా సమస్యలు, రాజ్యాంగ అంశాలు, అసెంబ్లీ ప్రొసిడీంగ్స్, రూల్‌బుక్‌పై అవగాహన కల్పించారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా కాంగ్రెస్ సభ్యులను సభలో వివరాలతో ధీటుగా ఎదుర్కొనేలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించినట్లుగా తెలిసింది. ఈ శిక్షణా కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మండలి బీఆర్‌ఎస్‌ఎల్పీ నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డితోపాటు పలువురు ఈ సమావేశంలో మాట్లాడారు.
వీరి అనుభవాలు, అనుసరించాల్సిన వ్యూహాలను మిగతా సభ్యులకు వివరించినట్లుగా తెలిసింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, ప్రజాప్రతినిధులు ఎల్ రమణ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, దాసోజ్ శ్రవణ్‌కుమార్, వాణీదేవి, కోవాలక్ష్మీ, కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్, శంభీపూర్ రాజు, తాత మధు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాధవరావు, తక్కెలపల్లి రవీందర్, కల్వకుంట్ల సంజయ్, విజయుడు, పార్టీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




