14 August, 2026 | 10:06 PM

Breaking News

చిట్యాలలో టీటీడీ కల్యాణ మండపం భూమిపై సమగ్ర విచారణ జరిపించాలి   •   విద్యుత్ ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు ఘన నివాళి   •   విద్యార్థులు కళావేదికను సద్వినియోగం చేసుకొని ఉన్నతులుగా ఎదగాలి   •   విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి   •   బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్   •   ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.. పొంగులేటి సైన్యం ఊరుకోదు   •   పశువుల దొంగలు అరెస్టు   •   శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం   •   మోస్రా వెళ్లే ప్రయాణికులకు తప్పని తిప్పలు   •   సీఎస్ సంజయ్ జాజు పలు అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్   •  

కేంద్రం కుట్ర భగ్నం, ప్రతిపక్షాల విజయం: ప్రియాంక గాంధీ

18-04-2026 04:32 PM

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల ముసుగులో దేశ సమాఖ్య స్వరూపాన్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా(Congress MP Priyanka Gandhi Vadra) శనివారం ఆరోపించారు. మహిళా కోటా చట్ట సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడం ప్రతిపక్షాల ఐక్యతకు లభించిన విజయమని ప్రియాంకా గాంధీ  ఉద్ఘాటించారు. మీడియా సమావేశంలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, మహిళల రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, ప్రస్తుత లోక్‌సభ సభ్యుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం 'మహిళల రిజర్వేషన్ల చట్టం-2023'ను(Women's Reservation Bill) అమలు చేయదలిస్తే, దానికి తాము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావడం వెనుక ప్రభుత్వ ఏకైక ఉద్దేశం శాశ్వతంగా అధికారంలో కొనసాగడమేనని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ దురుద్దేశాలను దేశ ప్రజలు గ్రహించగలరని పేర్కొన్నారు.