16 April, 2026 | 6:09 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

క్రీడాకారులకు బహుమతుల ప్రదానం

18-02-2026 12:00 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): గత డిసెంబర్ నెలలో టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో 12వ క్రీడా ఉత్సవాలు నిర్వహించారు. విజయం సాధించిన ఉద్యోగ క్రీడాకారులకు మంగళవారం టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో బహుమతులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రదానం చేశారు. టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ ఎం హుస్సేనీ (ముజీబ్) హాజరయ్యారు.

టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కుమార్ కార్యదర్శి, కురాడి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సూచన మేరకు హైదరాబాద్ జిల్లా, సిటీ కార్యాలయంకు వెయ్యి గజాలు స్థలం కేటాయించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారు.

కార్యక్రమంలో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, సిటీ అధ్యక్షులు శ్రీకాంత్, ఖమ్మం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండల్ రెడ్డి, నజీర్ పాషా, గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి శైలజ, హైదరాబాద్ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ కె.ఆర్ రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ నరేష్, ఖలీద్, శంకర్, జాయింట్ సెక్రెటరీ గీత, ప్రచార కార్యదర్శి వైదిక శాస్త్ర, కార్యవర్గ సభ్యులు ముకీంఖురేషి, ఏవీ శ్రీధర్ పాల్గొన్నారు.