15 June, 2026 | 4:04 PM

ఘనంగా ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

15-06-2026 03:20 PM

బోథ్,(విజయక్రాంతి): బోత్ మండల కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు .ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన కృషి ఎంతగానో ఉందన్నారు. ప్రజా సంక్షేమం సామాజిక న్యాయం కోసం బట్టి విక్రమార్క కృషి చేయడం ప్రశంసించదగ్గ విషయమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ఆయన పాత్ర ఎంతగానో ఉందన్నారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బి గంగారెడ్డి జిల్లా స్పోక్స్ పర్సన్ చంటి పసుల ,సోనాల కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గాజుల పోతన్న, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నరసింహాదాస్, ఉప సర్పంచ్ విజయరాజు రెడ్డి, రమేష్, ఆత్మ డైరెక్టర్ అబూద్ గడ్డల నారాయణ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్ ఆలపాటి అచ్యుతానంద రెడ్డి ఉమేష్ జాదవ్ రామారావు తదితరులు పాల్గొన్నారు