24 August, 2026 | 11:38 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

ప్రో-యాక్టివ్ పోలీసింగ్ ను పటిష్టంగా అమలు చేయాలి

18-06-2025 08:54 PM

పెద్దపల్లి పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్ తనిఖీలో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా..

పెద్దపల్లి (విజయక్రాంతి): ప్రో-యాక్టివ్ పోలీసింగ్ ను పటిష్టంగా అమలు చేయడం ద్వారా నేరాలు జరగకముందే అడ్డుకట్ట వేయాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ జా(CP Ambar Kishore Jha) తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లి జోన్ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ను కమిషనర్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ కు పోలీస్ అధికారులు పుష్పగుచ్చలను అందజేసి స్వాగతం పలికారు. ముందుగా పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం సిబ్బందితో పోలీస్ కమిషనర్ మాట్లాడారు.

ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పెండింగ్ కేసులు, నిందితుల అరెస్ట్, రౌడీ షీటర్ల వివరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు కోర్ట్ లో పెండింగ్ లో వున్న కేసులు, వాటికి సంబందించిన దర్యాప్తు వివరాలను కమిషనర్ స్టేషన్ సబ్ ఇన్స్ స్పెక్టరును అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ లో నిర్వహిస్తున్న పలురకాల రికార్డులను పరిశీంచారు. అనంతరం మాట్లాడుతూ... సీపీ పోలీస్ స్టేషన్లలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

తరచుగా నేరాలకు పాల్పడే వారి నేరచరిత్ర ఆధారంగా రౌడీషీట్, సస్పెక్ట్ షీట్లతో పాటు పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రో-యాక్టివ్ పోలీసింగ్ ను పటిష్టంగా అమలు చేయడం ద్వారా నేరాలు జరగకముందే అడ్డుకట్ట వేయాలని సూచించారు. రాత్రి వేళల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, హాట్ స్పాట్లను గుర్తించి ఇతర  ప్రభుత్వ శాఖల అధికారులతో కలసి రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని సీపీ సూచించారు. పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్యతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలని. ఫిర్యాదు వచ్చి వెంటనే స్పందించాలని, ప్రజలకు పోలీసులపై వున్న నమ్మకానికి తగ్గాటుగానే పోలీసులు నీజాయితీతో పనిచేయాలని కమిషనర్ తెలిపారు. 

పెద్దపల్లి సీఐ ఆఫీస్ తనిఖీలో భాగంగా అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను,  గ్రేవ్ కేసెస్ లలో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. నేరా పరిశోధన దర్యాప్తు లో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని, నేరాలు నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. చివరగా పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. ఈ తనిఖీల్లో ఏసీపీ జి. కృష్ణ, పెద్దపల్లి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి ఎస్.ఐ లక్ష్మణ్ రావు తో పాటు, సిసి హరీష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.