24 August, 2026 | 10:28 PM

Breaking News

అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •  

ఘనంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి జన్మదిన వేడుకలు..

18-06-2025 08:56 PM

పాపన్నపేట: కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి(Graduate MLC Anji Reddy) జన్మదిన వేడుకలు ఏడుపాయల వనదుర్గ మాత సన్నిధిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ఆయన అభిమానులు కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి వనదుర్గమాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితులు ఆలయ మర్యాదల ప్రకారం ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన పుట్టినరోజులు పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్లేష్ గౌడ్, ముదిరాజ్ సంఘం  జిల్లా నాయకుడు బైండ్ల సత్యనారాయణ, గడ్డం శ్రీనివాస్, సంతోష్ చారి, బి కొండ రాములు, సుంకరి సాయిలు, తదితరులు పాల్గొన్నారు.