కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తొలగించాలి
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) ను కలిసి వినతిపత్రం అందజేశారు. పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దుర్గాభవాని గ్రంథాలయ చైర్మన్ అర్జు మత్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రైతులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్కు వివరించారు. కొన్ని కేంద్రాలు ఎక్కువ కేజీల బస్తాలు తూకం వేస్తున్నారని దీని వెంటనే అరికట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.






